పోస్ట్‌లు

జనవరి, 2022లోని పోస్ట్‌లను చూపుతోంది

" ముక్కోటి ఏకాదశి - వైకుంఠ ఏకాదశి విశిష్టత "

చిత్రం
భగవద్భందువులందరికీ ముక్కోటి ఏకాదశి - వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు.. శ్లో" శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం ! విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం !! లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం ! వందే విష్ణుం భవభయహరం సర్వ లోకైకనాథం !! ముక్కోటి ఏకాదశి - వైకుంఠ ఏకాదశి.! "మాసానాం మార్గశీర్షోహం" మాసాలలో మార్గశిర మాసాన్ని నేనేనంటూ స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ గీతలో తెలియజేసాడు.. విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం మార్గశిరమాసం, దీనిని వైష్ణవ మాసం అని కూడా పిలుస్తారు.. మృగశిరా నక్షత్రంతో పౌర్ణమి కలిసి వచ్చే మాసం మార్గశిర మాసం, ఈ మాసానికి అధిపతి చంద్రుడు.. గీతాచార్యుడు 'నక్షత్రానాం మహం శశీ' అంటూ నక్షత్రాలలో చంద్రుడు కూడా నేనే అన్నాడు.. అందుకే చంద్రుడి ఆధిపత్యం, విష్ణువు అనుగ్రహం కలిగిన మాసం మార్గశిర మాసం.. హేమంత ఋతువులో వచ్చే మొదటి మాసం మార్గశిరం.. పూర్వ సౌరమాన కాల గణనలో మార్గశిర మాసమే మొదటి నెల.. అలాగే ప్రాచీన ఋషుల కాలంలో సంవత్సరం మార్గశిర మాసంతోనే ప్రారంభమయ్యేది..   ప్రతీ నెలలో శుక్లపక్షము, కృష్ణ పక్షము రెండు ఏకాదశులు., మొత్తం సంవత్సరానికి 24 ఏకా...