పోస్ట్‌లు

మువ్వన్నెల జెండా వీరులు | బాలగేయం - కవిత

చిత్రం
"మువ్వన్నెల జెండా వీరులు" (బాల గేయం - కవిత) కూ.. చికుబుకు బండి సప్తవర్ణాల వెలుగండి తారాజువ్వల తలుకండి తొందర తొందరగా ఎక్కండి చికుబుకు చికుబుకు రైలండి కూ కూ.. చికుబుకు బండి.. కూ.. చికుబుకు బండి ఎక్కడి ఎక్కడి కెల్తుందండి బాలల మండి తారలమండి పట్నము షికారు వెల్తామండి కలల సౌధాన్ని చూస్తామండి కూ కూ.. చికుబుకు బండి.. కూ.. చికుబుకు బండి పల్లెలు దాటి వెల్తుందండి పట్నం దారి‌న పోతుందండి స్వప్నాల వీధులు చుట్టేస్తుందండి జాబిలి వైపు పరిగెడుతుందండి కూ కూ.. చికుబుకు బండి.. కూ‌‌.. చికుబుకు బండి టిక్కెట్టు ఎంత కట్టాలండి సాహసయాత్రకు బయలెల్లామండి కల్మష మెరుగని చిరునవ్వండి మనసున తామర వికసించాలండి కూ కూ.. చికుబుకు బండి.. కూ.. చికుబుకు బండి బాలలు మీరు తోడుగ లేరు పట్నం దారిన వెల్తే షికారు దొంగలుంటారు పట్టుకెల్తారు డబ్బులున్నాయ దోచుకెల్తారు చిన్నారు చివరికి మిగిలే కన్నీరు కూ కూ.. చికుబుకు బండి.. కూ.. చికుబుకు బండి బాలలమని దిగులే పడకండి ధైర్యం ఒడిలో కలతలు మరువండి సుభాషుడు మాకు తోడుంటాడండి శివాజీ నీడన నడిపిస్తాడండి గుండెలో జ్వాలే రగలాలండి కూ కూ.. చికుబుకు బండి.. కూ.. చికుబుకు బండి అమ్మో, మీరు...

సిద్ధులగుట్ట (సిద్ధాద్రి) చరిత్ర, వైభవం, మహాత్మ్యం | మోహనకృష్ణ భార్గవ

చిత్రం
శ్రీ స్వయంభూః సిద్ధేశ్వర స్వామి దేవస్థానము కొడవటూరు సిద్ధులగుట్ట (సిద్ధాద్రి) చరిత్ర, వైభవం, మహాత్మ్యం (సంవత్సరమునకు చింతాకు పరిమాణం పెరుగుతున్న ఏకైక స్వయంభూః శివలింగం) పరిశోధన వ్యాస రచయిత : డా. మోహనకృష్ణ భార్గవ ఓం.  శుద్ధాయ బుద్ధాయ తధైవనిత్యం, ముక్తాయ సిద్ధాయ తధేశ్వరాయ !  ఏవం భవన్త్యై భవ వామగామై, భూయాంపిమేసంతు నమాంసి నిత్యం !! ఓం.  మహాతీర్థ రాజస్య తీరే విభాంతం, మహాభూతిరూపం మహాత్మైక వేద్యం !  మహాసిద్ధిపూర ప్రధానైక దక్షం, భజామైవ సిద్ధేశ్వరం సిద్ధ శంభుమ్‌ !! (మోహనకృష్ణ స్వయంగా ప్రచురించిన కరపత్రాలు) ఉపోద్ఘాతం - శైవమతము మనిషి మోక్షగామి, నిత్యాన్వేషి.. పునర్జన్మ లేనటువంటి శాశ్వత జీవన్ముక్తి కొరకు నిరంతరం తాపత్రయ పడుతుంటాడు. ‘శం కరోతితి శంకరః’ అన్నట్లుగా మనిషి జీవితంలో దుఃఖాలను దూరం చేసి సుఖసంతోషాలను, భోగభాగ్యాలను ప్రసాదించి, చివరన శాశ్వత కైవల్య ముక్తి ప్రసాదించే ఈశ్వరత్వం కలిగినవాడు పరమేశ్వరుడు.  ఆది అంతము లేని ఆదిపురుషుడు, సకల చరాచర సృష్టికి మూలపురుషుడు, సాకార నిరాకార అనంత శక్తి స్వరూప సర్వేశ్వరుడు, అనం...

జీవితాల్లో వెలుగులు నింపే దీపావళి..

చిత్రం
"జీవితాల్లో వెలుగులు నింపే దీపావళి.." -- ఐదు రోజుల దీపావళి పండుగ విశేషాలతో, ప్రతీ హిందువు తప్పకుండా తెలుసుకోవలసిన విషయాలతో ప్రత్యేక వ్యాసం.. -- డా. మోహనకృష్ణ భార్గవ (ఈనెల పద్మ మిత్ర మాస పత్రికలో ప్రచురితమైన వ్యాసం) భారతీయ వైదిక సంస్కృతిలో అతి ముఖ్యమైనది, ప్రాచీనమైది, తెలుగు ప్రజలకు అత్యంత ప్రధానమైన పండుగ దీపావళి.. ఉత్తరాది దక్షిణాది సాంప్రదాయక సారూప్యత, వ్యత్యాసాలు ఎన్ని ఉన్నప్పటికీ కుల, వర్ణ, వర్గ, జాతి, భాషా భేదం లేకుండా భిన్నత్వంలో ఏకత్వం అనే విధంగా యావత్ దేశ ప్రజలందరూ కలిసి జరుపుకునే ఏకైక పర్వదినంగా దీపావళి నిలుస్తున్నది. ఎన్ని యుగాలు, ఎన్ని లక్షల సంవత్సరాల నుండి ఈ దీపావళి జరుపుకుంటున్నామో చెప్పలేము కానీ సత్యయుగానికి పూర్వమే జరిగిన క్షీరసాగర మథనం నుండి రావణుడిపై విజయానంతరం అయోధ్యకు రాముడి ఆగమనం, నరకాసుర వధ, ప్రజలకు రాక్షసుల నుండి విముక్తి వరకు అనేక పురాణ గాథలు దీపావళి వైభవాన్ని తెలియజేస్తున్నాయి.. కార్తవీర్యార్జునుడి నుండి సగర చక్రవర్తి వరకు నేటి కాకతీయుల వరకు కూడా ఎందరో చక్రవర్తి, సార్వభౌములు ఈ దీపావళి ఉత్సవాలను నిర్వహించినట్లు తెలుస్తున్నది.. శ్ల...

జీవితాల్లో వెలుగులు నింపే దీపావళి || డా. మోహనకృష్ణ భార్గవ

"జీవితాల్లో వెలుగులు నింపే దీపావళి.." -- ఐదు రోజుల దీపావళి పండుగ విశేషాలతో, ప్రతీ హిందువు తప్పకుండా తెలుసుకోవలసిన విషయాలతో ప్రత్యేక వ్యాసం.. -- డా. మోహనకృష్ణ భార్గవ   (ఈనెల పద్మ మిత్ర మాస పత్రికలో ప్రచురితమైన వ్యాసం) భారతీయ వైదిక సంస్కృతిలో అతి ముఖ్యమైనది, ప్రాచీనమైది, తెలుగు ప్రజలకు అత్యంత ప్రధానమైన పండుగ దీపావళి.. ఉత్తరాది దక్షిణాది సాంప్రదాయక సారూప్యత, వ్యత్యాసాలు ఎన్ని ఉన్నప్పటికీ కుల, వర్ణ, వర్గ, జాతి, భాషా భేదం లేకుండా భిన్నత్వంలో ఏకత్వం అనే విధంగా యావత్ దేశ ప్రజలందరూ కలిసి జరుపుకునే ఏకైక పర్వదినంగా దీపావళి నిలుస్తున్నది. ఎన్ని యుగాలు, ఎన్ని లక్షల సంవత్సరాల నుండి ఈ దీపావళి జరుపుకుంటున్నామో చెప్పలేము కానీ సత్యయుగానికి పూర్వమే జరిగిన క్షీరసాగర మథనం నుండి రావణుడిపై విజయానంతరం అయోధ్యకు రాముడి ఆగమనం, నరకాసుర వధ, ప్రజలకు రాక్షసుల నుండి విముక్తి వరకు అనేక పురాణ గాథలు దీపావళి వైభవాన్ని తెలియజేస్తున్నాయి.. కార్తవీర్యార్జునుడి నుండి సగర చక్రవర్తి వరకు నేటి కాకతీయుల వరకు కూడా ఎందరో చక్రవర్తి, సార్వభౌములు ఈ దీపావళి ఉత్సవాలను నిర్వహించినట్లు తెలుస్తున్నది.. శ్లో " దీపం జ్యోతిః ...