పోస్ట్‌లు

ఆగస్టు, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

మువ్వన్నెల జెండా వీరులు | బాలగేయం - కవిత

చిత్రం
"మువ్వన్నెల జెండా వీరులు" (బాల గేయం - కవిత) కూ.. చికుబుకు బండి సప్తవర్ణాల వెలుగండి తారాజువ్వల తలుకండి తొందర తొందరగా ఎక్కండి చికుబుకు చికుబుకు రైలండి కూ కూ.. చికుబుకు బండి.. కూ.. చికుబుకు బండి ఎక్కడి ఎక్కడి కెల్తుందండి బాలల మండి తారలమండి పట్నము షికారు వెల్తామండి కలల సౌధాన్ని చూస్తామండి కూ కూ.. చికుబుకు బండి.. కూ.. చికుబుకు బండి పల్లెలు దాటి వెల్తుందండి పట్నం దారి‌న పోతుందండి స్వప్నాల వీధులు చుట్టేస్తుందండి జాబిలి వైపు పరిగెడుతుందండి కూ కూ.. చికుబుకు బండి.. కూ‌‌.. చికుబుకు బండి టిక్కెట్టు ఎంత కట్టాలండి సాహసయాత్రకు బయలెల్లామండి కల్మష మెరుగని చిరునవ్వండి మనసున తామర వికసించాలండి కూ కూ.. చికుబుకు బండి.. కూ.. చికుబుకు బండి బాలలు మీరు తోడుగ లేరు పట్నం దారిన వెల్తే షికారు దొంగలుంటారు పట్టుకెల్తారు డబ్బులున్నాయ దోచుకెల్తారు చిన్నారు చివరికి మిగిలే కన్నీరు కూ కూ.. చికుబుకు బండి.. కూ.. చికుబుకు బండి బాలలమని దిగులే పడకండి ధైర్యం ఒడిలో కలతలు మరువండి సుభాషుడు మాకు తోడుంటాడండి శివాజీ నీడన నడిపిస్తాడండి గుండెలో జ్వాలే రగలాలండి కూ కూ.. చికుబుకు బండి.. కూ.. చికుబుకు బండి అమ్మో, మీరు...