ఆచార్య దేవో భవ - గురు (వ్యాస) పౌర్ణమి
"ఆచార్య దేవో భవ - గురు (వ్యాస) పౌర్ణమి ప్రత్యేక వ్యాసం" "ఆచార్య దేవో భవ" భారతీయ సనాతన సంస్కృతిలో గురువుకు గొప్ప స్థానమున్నది. జన్మనిచ్చిన తల్లి తండ్రుల తరువాత విద్య, జ్ఞానము బోధించి ద్విజుడిగా తీర్చిదిద్ది, రెండవ జన్మని ప్రసాదించిన పరమపూజ్యుడిగా నిలుస్తున్నాడు గురువు. మనిషి జననం నుండి మరణం వరకు ఏదో ఒక కొత్త విషయాన్ని అన్వేషిస్తూ, నిరంతరం సాధనకై పరితపిస్తూ ఉంటాడు. అది సామాజిక అంశమైనా, ప్రత్యక్షంగా కనిపించే భౌతిక పరిశోధనైనా, ఆత్మకు సంబంధించిన భగవత్ ఆధ్యాత్మిక జ్ఞానమైన కావచ్చు, దానిని సాధించడానికి అనుభవ నిష్ణాతుడి మార్గదర్శన తప్పనిసరి, మనం జ్ఞానాన్వేషణలో ఎవరినైతే ఆశ్రయిస్తామో అతడే గురువు. అతడు విద్యార్థికి మార్గదర్శి, పరిపూర్ణమైన జ్ఞానము కలిగి, త్యాగశీలతతో అనంత విద్యను దానం చేసే ఆదర్శవంతమైన స్పూర్తిప్రదాత, సృష్టి స్థితి లయలకు మూలమైన వాస్తవిక తత్వాన్ని బోధించే ఆచార్యుడు.. " గురు బ్రహ్మ, గురుర్ విష్ణుః, గురు దేవో మహేశ్వరః ! గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః !! " వైదిక సంస్కృతిలో గురువే బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు, సాక్షాత్తూ పరమాత్మ స్వరూపంగా భా...