పోస్ట్‌లు

అక్టోబర్, 2022లోని పోస్ట్‌లను చూపుతోంది

నూలు పున్నమి | కవిత | మోహనకృష్ణ భార్గవ

చిత్రం
" నూలు పున్నమి " (కవిత) ఆగష్టు నెలలో ప్రచురితమైనది, కాస్త ఆలస్యంగా అందింది.. చదివి మీ అభిప్రాయం స్పందించండి‌‌.. #నూలుపున్నమి #శ్రావణపౌర్ణమి #రాఖీపౌర్ణమి  #చేనేతసాహిత్యం

నల్ల పులి | కవిత | సాయుధ పోరాట యోధుడు నల్లా నర్సింహ్ములు | డా. మోహనకృష్ణ భార్గవ

చిత్రం
"నల్ల పులి" దొరల ఆగడాల గడీలకు దొరసాని కాళ్ల ముందు న్యాయాన్ని కమ్మేసిన రజాకార్లు నెత్తురు పారించిన  అరాచక రాచరికంలో తలతెగినా తలొంచని ప్రజా.. వెట్టి బతుకుల గుండె చప్పుళ్లలో అణగారిన శ్రామిక జీవులు ఆకలి పాములయి బుసకొట్టిన కోరలు దొరల చీకటి బలత్కారాలపై  ఉదయించిన  సూర్యుడతను.. కడ'వెండి' గిన్నెలో కడిగిన తెల్లని ముత్యమతను శ్రమజీవుల బువ్వకుండలో కుతకుత ఉడికిన ఎర్రని మెతుకు దోపీడీ గడీలపై సంఘమయి దౌర్జన్యాల మీద గుతుపయి పీడితుల్ని ఏకం చేసిన  'నల్ల పులి' అతను.. సమత కోసం, మమత కోసం కూడు కోసం, గూడు కోసం భుక్తి కోసం, విముక్తి కోసం దొరలు చెరబట్టిన  భూముల విముక్తి కోసం  పోరుదారి నడిచిన యోధుడతను.. మగ్గం బతుకును వదిలిన  'చేనేత' అతను ప్రజాపోరు దారిలో  జన విముక్తి కోసం ఆయుధమెత్తి దొరల గుండెలపై దూకిన  తెలంగాణా బెబ్బులి అతను వెట్టి చాకిరి వేదింపులపై ఎదురు తిరిగి ప్రజల గుండెల్లో  నిలిచిన 'ప్రజా నేత' అతను చీకటి బతుకుల్లో వెలుగు నింపేందుకు అరణ్యంలో రాతిరి ఉదయించిన నల్లని సూరీడతను‌.. (తెలంగాణ సాయుధ పోరాట యోధుడు  నల్లా నర్సింహులు జయంతి సందర్భంగా.. ...