పోస్ట్‌లు

ఏరువాక పున్నమి - కవిత

చిత్రం
"ఏరువాక పున్నమి" (కవిత) ఎండిన నేల పగిలిన మనసు పుండైన దేహాన్ని జోడెడ్ల బండికి కట్టి కర్షకుడి స్వేదంతో సేద్యం సారం లేని జీవితం ఎండమావిగా మారి కానరాని గింజ భవిష్యత్తుకై నొప్పుల బాధలోర్చే కసరత్తు అలుగుపారిన శేర్దార్ ఆశలు నాగలికింద నలిగే కోర్కెలు దుక్కిదున్నిన నేల తొలకరిజల్లు పలకరింతతో పొత్తిల్లను చీల్చుకుని పుట్టిన పంటను చూసి పరవశించి నాగల్లను ముద్దాడే హాలికుడు ఇది తొలికరి జల్లుల పండగ నేలమ్మ కడుపు పండే పండగ రైతన్న గుండేపై భారం తీరే పండగ ఇది అన్నదాతల ఎరువాక పండగ అవని అన్నపూర్ణగా మారి అన్నం పెట్టే ఆపన్నహస్తానికి మిగిలేది ఆనందమో.. రేగడి కక్కిన హాలాహలమో.. దళారీల గుప్పెట్లో సమాధానం..! (జూన్ 14, ఏరువాక పున్నమి) డా" ఎక్కలదేవి మోహనకృష్ణ భార్గవ సామాజిక కవి, రచయిత జనగామ జిల్లా, తెలంగాణ. (మే - 27న  అగ్రగామి మాస పత్రికలో ప్రచురితం)

"సాహిత్య పురస్కార పారితోషికాన్ని దేవాలయ నిర్మాణానికి సమర్పణ"

చిత్రం
"సాహిత్య పురస్కార పారితోషికాన్ని దేవాలయ నిర్మాణానికి సమర్పణ" - ఆర్ఎస్ఎన్ రాష్ట్ర సాహిత్య పురస్కార పారితోషికం ఐదువేల రూపాయలు దేవాలయ నిర్మాణానికి సమర్పించిన డాక్టర్ మోహనకృష్ణ భార్గవ   జనగామ : జనగామ జిల్లా కేంద్రానికి చెందిన డాక్టర్. మోహనకృష్ణ భార్గవ గత మంగళవారం రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖామాత్యులు తన్నీరు హరీష్ రావు, మాజీ ఎమ్మెల్సీ ఆర్. సత్యనారాయణ మరియు పలువురు ప్రముఖ జాతీయ స్థాయి జర్నలిస్టులు, ప్రభుత్వ అధికారులు, నాయకులు  సాహితీవేత్తల చేతుల మీదుగా ఆర్ఎస్ఎన్ రాష్ట్ర సాహిత్య పురస్కారాన్ని అందుకున్నారు. ఇట్టి పురస్కారంతో పాటుగా 5,000/- పారితోషికం అందుకున్నారు. ఇట్టి పారితోషికం నగదు మొత్తాన్ని మోహనకృష్ణ శనివారం రోజున శ్రీరాంనగర్ కలానీ, మూలబావి శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో నూతనంగా నిర్మాణం అవుతున్న శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయ నిర్మాణానికి సమర్పణ చేశారు. ఇట్టి నగదు ఆలయ కమిటీ నిర్వాహకులు గజ్జెల నర్సిరెడ్డి, యెలసాని కృష్ణమూర్తి, కందాడి యాదగిరి, కుర్రెముల సత్యనారాయణకు అందజేశారు. ఈ సందర్భంగా మోహనకృష్ణ మాట్లాడుతూ ఇట్టి పురస్కారాన్ని అందించిన నిర్వాహకులు, అతిథులకు ధన...

" ఎవరొస్తారని " కవిత (2020)

చిత్రం
"ఎవరొస్తారని.." కవిత - 2020 పచ్చపచ్చని పచ్చిక బయళ్లు చచ్చిపుట్టిన కొమ్మ‌చిగుళ్లు మురిపించే పూలవాసన ఆత్మీయ పలకరింపువోలే ఆటలాడి అలసిన పసి హృదయాలను తాకి పలకరించే తూనీగలెక్కడ.? కురిసే చినుకు మురిసే మనసు నేలమ్మని నమ్మి పుడమిని దున్ని ప్రకృతి పరవశాన్ని అస్వాదిస్తూ చెమట చుక్కని నీటిబొట్టుగా   మార్చిన   హాలికుడ్ని  వసంతమాలికలా   వచ్చి  పులకరించి నాట్యమాడే మయూరాలెక్కడ.? ఎండా వాన తేడా తెలియక తీరం‌తెలియని అగమ్యగోచర బ్రతుకుబండి నడపలేక అలమటిస్తు ఆకలికేకల హాలాహళాన్ని మింగిస్తుంటే శ్రమపీడిత శ్రామికుల గోడువినేందుకు ఆప్యాయంగా పలకరించే రామచిలుకలెక్కడ.? గుప్పెట్లో దాగిన గాలి కనురెప్పల్లో నిండిన నీరు దాహాన్ని తీర్చలేని సంద్రం ఆర్తితో ఆకాశం వైపు చూపు ఆశ నిరాశల కొలమిలో మండే అగ్నికి ఆహుతైన అల్పమైన బ్రతుకుల‌ చూసి కన్నీరు కార్చే పిచ్చుకలెక్కడ.? పల్లెలు పట్నాలాయే అడవులు ఆక్రమణాయే పొగ దూలితో నిండిన గాలి శ్వాసదాటక ప్రాణం తీస్తుంటే పొల్యూషన్ ఎర, ప్లాస్టిక్ తెర ఫోర్జీ, ఫైజీ అంతర్జాల ఉచ్చులో రేడియేషన్ ‌దెబ్బకి చితికిన బ్రతుకులు.! స్వార్థ శక్తులు దోపిడి దొంగల చేతి...

" ఆర్ఎస్ఎన్ రాష్ట్ర సాహిత్య పురస్కారాన్ని అందుకున్న డాక్టర్ మోహనకృష్ణ భార్గవ "

చిత్రం
" ఆర్ఎస్ఎన్ రాష్ట్ర సాహిత్య పురస్కారాన్ని అందుకున్న డాక్టర్ మోహనకృష్ణ భార్గవ " - రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖామంత్రి హరిష్ రావు చేతుల మీదుగా ఘన సన్మానం.. (పద్మాంజలి జాతీయ మాసపత్రికలో ప్రచురితం) (అగ్రగామి వారపత్రికలో ప్రచురితం) "ఆర్ఎస్ఎన్ రాష్ట్ర సాహిత్య పురస్కారాన్ని అందుకున్న డాక్టర్ మోహనకృష్ణ భార్గవ " - రాష్ట్ర మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు మరియు ప్రముఖుల చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు. - "పచ్చధనం" సంకలనంలో ఉత్తమ కవితగా ఎంపికైన మోహనకృష్ణ "ఎవరొస్తారని" కవిత   Facebook link :  Facebook page link హైద్రాబాద్ : సమాజ హితాన్ని కాంక్షిస్తూ కలాలను పదును పెట్టిన కవులను పురస్కారాలతో సత్కరించడం హర్షణీయమన్నారు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖామాత్యులు తన్నీరు హరీష్ రావు.  మాజీ శాసనమండలి సభ్యులు, తెలంగాణ పబ్లిక్ కమీషన్ సభ్యులు  ఆర్. సత్యనారాయణ, ఆర్ఎస్ఎన్ సేవా ఫౌండేషన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ...

మట్టి వాసన - పూలపరిమళం | సమీక్ష

చిత్రం
మట్టి వాసన - పూలపరిమళం  (పద్మాంజలి జాతీయ మాస పత్రిక మే నెల సంచికలో) (అగ్రగామి వార పత్రికలో ప్రచురితమైన వ్యాసం - 21-04-2022) కవిత్వం సామాన్యుడిని, సమాజాన్ని కదిలించగలిగినపుడే ఆ కవికి గాని కవిత్వానికి గాని సార్థకత దక్కుతుంది. మనిషి శాశ్వతం కాదు కాని తన భావాలు, సాహిత్యం మాత్రం శాశ్వతంగా నిలిచిపోతాయి‌. ఏనాటికి నశించనిదే అక్షరం. అవి సమాజంలో చైతన్యానికి, మార్పుకి కారణమైతే ఏనాటికైనా ఆ ఘనత తప్పకుండా కవికి దక్కి తీరుతుంది. సమాజాన్ని చైతన్యం చేయడానికే తపించే కొందరు కవులను అభ్యుదయ కవులుగా పిలుస్తుంటాం. సాహిత్యం అంటే అక్షరాలను వెదజల్లడం కాదు. తానుకూడా ఆ భావాలకి కట్టుబడివుండి బతికి చూపించేవాడే అసలైన అభ్యుదయ కవి అవుతాడు. రాముడు ధర్మాన్ని ఆచరించమని బోధించి వదిలేయలేదు, ముందు తన ధర్మాన్ని నిర్వర్తించి చూపించాడు కనుకే ఆదర్శపురుషుడయ్యాడు. తాను నమ్ముకున్న సిద్దాంతాలకు కట్టుబడివున్నవారెవరైనా సరే సమాజానికి ఆదర్శప్రాయులే అవుతారు. రాయలవారి ఆస్థానంలో అష్టదిగ్గజాలు అనే మహాకవులను పోషించారు. అది రాజ్యానికి సాహిత్య పోషకులుగా ఎంతో కీర్తినిచ్చిన విషయం. అయితే వారు ఆయా కవులతో అనేక ప...

ఉస్మానియా లో జ్యోతిష్యశాస్త్ర కోర్సులను ప్రవేశపెట్టాలి

చిత్రం
" ఉస్మానియాలో జ్యోతిష్యశాస్త్ర కోర్సులను ప్రవేశపెట్టాలి " - ఓయూ లో ప్రత్యేక జ్యోతిష్యశాస్త్ర పరిశోధన విభాగాన్ని ఏర్పాటుచేయాలి - డా" మోహనకృష్ణ భార్గవ 4 ఏప్రిల్,  సోమవారం, హైదరాబాద్ : ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జ్యోతిష్యశాస్త్ర కోర్సులను ప్రవేశపెట్టాలని, ప్రత్యేక పరిశోధన విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్, ఉస్మానియా డీన్. ప్రొఫెసర్ అనుమల్ల బాలకిషన్ గారిని డాక్టర్ మోహనకృష్ణ భార్గవ కోరారు. సోమవారం ఓయూ కాంపస్ లోని డీన్ కార్యాలయం లో వారిని కలిసి వినతిపత్రం అందించారు. వారితో మోహనకృష్ణ మాట్లాడుతూ ప్రాచీన భారతీయ వాఙ్మయములైన వేదములలో జ్యోతిష్యశాస్త్రం ప్రధాన విభాగమన్నారు. జ్యోతిష్యము, జ్యోతిర్వైద్యము, గణిత సిద్ధాంతం, వాస్తు, ప్రశ్న, నాడీ, హోరాశాస్త్రం వంటి అనేక విభాగాలతో ఖగోళశాస్త్ర, సాయణ, నిరయణ సూత్రాలతో పూర్తి శాస్త్రీయత కలిగివున్న జ్యోతిష్య శాస్త్రాన్ని భారతీయులే కాకుండా పాశ్చాత్య దేశాలలోను ఖ్యాతి పొందిందన్నారు. ఇటువంటి జ్యోతిష్యశాస్త్రాన్ని ఉస్మానియా విశ్వవిద్యాలయం సైన్స్ డిపార్ట్మెంట్ లేదా ఆర్ట్స్ డిపార్ట్మెంట్ లో ఒక విభాగాన్ని కేటాయించాలని కోరారు. రె...