పోస్ట్‌లు

" ముక్కోటి ఏకాదశి - వైకుంఠ ఏకాదశి విశిష్టత "

చిత్రం
భగవద్భందువులందరికీ ముక్కోటి ఏకాదశి - వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు.. శ్లో" శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం ! విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం !! లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం ! వందే విష్ణుం భవభయహరం సర్వ లోకైకనాథం !! ముక్కోటి ఏకాదశి - వైకుంఠ ఏకాదశి.! "మాసానాం మార్గశీర్షోహం" మాసాలలో మార్గశిర మాసాన్ని నేనేనంటూ స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ గీతలో తెలియజేసాడు.. విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం మార్గశిరమాసం, దీనిని వైష్ణవ మాసం అని కూడా పిలుస్తారు.. మృగశిరా నక్షత్రంతో పౌర్ణమి కలిసి వచ్చే మాసం మార్గశిర మాసం, ఈ మాసానికి అధిపతి చంద్రుడు.. గీతాచార్యుడు 'నక్షత్రానాం మహం శశీ' అంటూ నక్షత్రాలలో చంద్రుడు కూడా నేనే అన్నాడు.. అందుకే చంద్రుడి ఆధిపత్యం, విష్ణువు అనుగ్రహం కలిగిన మాసం మార్గశిర మాసం.. హేమంత ఋతువులో వచ్చే మొదటి మాసం మార్గశిరం.. పూర్వ సౌరమాన కాల గణనలో మార్గశిర మాసమే మొదటి నెల.. అలాగే ప్రాచీన ఋషుల కాలంలో సంవత్సరం మార్గశిర మాసంతోనే ప్రారంభమయ్యేది..   ప్రతీ నెలలో శుక్లపక్షము, కృష్ణ పక్షము రెండు ఏకాదశులు., మొత్తం సంవత్సరానికి 24 ఏకా...

"వరల్డ్ ఆష్ట్రో బయోగ్రఫీ" లో ప్రముఖ స్థానాన్ని పొందిన డా" మోహనకృష్ణ భార్గవ

చిత్రం
𝑮𝒐𝒕 𝒂 𝑷𝒓𝒐𝒎𝒊𝒏𝒆𝒏𝒕 𝑷𝒐𝒔𝒊𝒕𝒊𝒐𝒏 𝒊𝒏 "𝙒𝙊𝙍𝙇𝘿 𝘼𝙎𝙏𝙍𝙊 𝘽𝙄𝙊𝙂𝙍𝘼𝙋𝙃𝙔" - 𝐀 𝐋𝐞𝐠𝐚𝐜𝐲 𝐎𝐟 𝐀𝐬𝐭𝐫𝐨𝐥𝐨𝐠𝐲 -  𝑺𝒖𝒄𝒄𝒆𝒔𝒔 𝑺𝒕𝒐𝒓𝒚 𝑶𝒇 𝑨𝒔𝒕𝒓𝒐𝒈𝒆𝒓𝒔  - ఇంటర్నేషల్ ఆష్ట్రోలాజికల్ ఫెడరేషన్. (మల్టీ నేషనల్ అక్రిడిటేషన్ ఆర్గనైజేషన్ -యూఎస్ఎ).. వారు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రచురించిన "వరల్డ్ ఆష్ట్రో బయోగ్రఫీ" ప్రపంచ ప్రముఖ జ్యోతిష్యశాస్త్ర పరిశోధకుల జీవిత చరిత్రలు, విజయ గాథల సంకలనంలో ప్రముఖ స్థానాన్ని పొందిన Dr. MohanaKrishna Bhargava  - "వరల్డ్ ఆష్ట్రో బయోగ్రఫీ" లో భారత్ నుండి కేవలం కొద్ది మందికే స్థానం దక్కగా అందులో ప్రముఖ స్థానాన్ని పొందిన ఏకైక తెలంగాణ జ్యోతిష్య పండితుడు డా"మోహనకృష్ణ భార్గవ కావడం విశేషం..

శ్రీ దత్తాత్రేయ జయంతి - ఆరాధన - స్తోత్ర పారాయణం

చిత్రం
శ్రీ దత్తాత్రేయ జయంతి - ఆరాధన - స్తోత్ర పారాయణ శివ కేశవులు ఒకటే అని నిరూపించే తత్వం, త్రిమూర్తి స్వరూప దత్తరూపం.. గురు సాంప్రదాయానికి మూలం దత్తాత్రేయుడు.. సకల మంత్ర యంత్ర తంత్ర శాస్త్రాలను అనుగ్రహించే ఆది గురువు. కేవలం స్మరించుట చేతనే దుఃఖాలను దూరం చేసే భక్త సులభుడు. దత్త దత్త అనిస్మరించిన మాత్రానే కరుణించే కృపాసింధు.. పరమాత్మ, పరబ్రహ్మ తత్వాలకు ప్రత్యక్ష నిదర్శనం అత్రేయుడు. శ్రీ దత్తాత్రేయ స్వామి జయంతి సందర్భంగా.. స్వామిని ఆరాధించి, స్వామి కృపాకటాక్ష వీక్షణాదులతో సుఖసంతోషాలతో వర్థిల్లాలని కోరుకుంటూ.. స్వామి స్తోత్రాలు అందిస్తున్నాను.. జపించి తరించండి.. దత్తుని ఉపాసించడం వలన విద్యార్థులకు మేథస్సు పెంపొందుతుంది. ఉన్నత విద్యావంతులుగా ఎదుగుతారనటంలో సందేహం లేదు.,  ముఖ్యంగా జన్మ జాతకంలో గానీ, గ్రహచారంలో గానీ గురుగ్రహ బలం తక్కువగా ఉన్నవారు.,  ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఉద్యోగ వ్యాపారాదుల్లో ఇబ్బందులు ఎదుర్కుంటున్నవారు., ఆలస్య వివాహ సమస్యతో బాధపడుతున్నవారు., సంతానలేమి, కుటుంబ సమస్యలతో సతమతమవుతున్నవారు., దత్త జయంతి రోజున తప్పకుండా దత్తాత్రేయుడిని ఆరాధించి సత్ఫలితాలను పొందవచ్చు...

ధనుర్మాస వైభవము - గోదాదేవి దివ్య చరిత్ర

చిత్రం
                    " ధనుర్మాసము " చైత్ర, వైశాఖ, -  కార్తీక, మార్గశిర మాసాలు కదా మనము పిలిచేది, మరి ఈ ధనుర్మాసము అంటే ఏమిటి అని చాలా మందికి సహజంగా కలిగే సందేహమే..! ఇంతకీ ఈ ధనుర్మాసము అంటే ఏమిటో దాని విశిష్టత ఏమిటో తెలుసుకుందాం..! కాలాన్ని మనం సహజంగా సంవత్సరములు, సంవత్సరానికి రెండు భాగాలుగా - రెండు ఆయనములు, సంవత్సరానికి ఆరు భాగాలుగా ఋతువులు, సంవత్సరాన్ని పన్నెండు భాగాలుగా మాసములు, ప్రతీ మాసములో పదిహేను తిథులతో కూడిన రెండు పక్షాలు, అదే మాసంలో ఏడు రోజులతో కూడిన నాలుగు వారాలు ఇదంతా మనం కాలాన్ని కొలిచే ప్రక్రియ..  అయితే ఈ కాలాన్ని సూర్య చంద్రుల సంచార ప్రమాణంగా కొలుస్తారు. సూర్యున్ని ఆధారింతంగా కొలిచే గణిత విధానాన్ని సూర్యమానం అని (సౌరమానం)., చంద్రుని ఆధారితంగా కొలిచే గణిత విధానాన్ని చాంద్రమానం అని పిలుస్తారు., ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే చంద్రుడు శుద్ధ పాడ్యమి రోజున ఉదయించి పదిహేను రోజులకి పూర్తి  పౌర్ణమి ప్రకాశించి తిరిగి మరొక పదిహేను రోజులు కాంతి కోల్పోతూ అమావాస్యకి అస్తమిస్తాడు, ఈ నెలని చాంద్రమాన మాసం అంటాం.. అలా...

సుబ్రహ్మణ్య వైభవం - సుబ్రహ్మణ్య షష్ఠి (పార్ట్ -2)

చిత్రం
" సుబ్రహ్మణ్య వైభవం " (పార్ట్ -2, సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా వారి చరిత్ర, ) ఆది దంపతుల గారాల బిడ్డ, గణనాయకుడి ముద్దుల సోదరుడు, కృత్తికల అపురూప తనయుడు, ఆరుముఖాల అరుదైన అవతారం. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడు. సుబ్రహ్మణ్యుడు మార్గశిర శుద్ధ షష్ఠి  రోజున కృత్తికా నక్షత్రంలో జన్మించారు. ఆయన జన్మ తిథిని సుబ్రహ్మణ్య షష్ఠి, కుమార షష్ఠి, స్కంద షష్ఠి, కార్తికేయ షష్ఠి, శరవణ షష్ఠి, సుబ్బరాయ షష్ఠి అనే పేర్లతో పిలుస్తారు‌. నమస్తే నమస్తే మహాశక్తి పాణే | నమస్తే నమస్తే లసద్వజ్రపాణే || నమస్తే నమస్తే కటిన్యస్త పాణే | నమస్తే నమస్తే సదాభీష్ట పాణే || ఒక చేతిలో మహాశక్తి ఆయుధాన్ని, మరొక చేతిలో ప్రకాశవంతమైన వజ్రాయుధాన్ని, ఇంకో చేతిని కటిపై ఉంచి, మరొక హస్తంతో అభయాన్ని  అనుగ్రహిస్తూ సదా అభీష్టాలను ఒసగుతున్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రణమిల్లుతు, శరణువేడుతున్నాను.. ఎన్నో పేర్లు ఆ స్వామికి.. ~ షణ్ముఖుడు లేదా ఆర్ముగం – ఆరు ముఖములు గలవాడు., ~ స్కందుడు – పరమశివుని స్ఖలనం వల్ల ఆవిర్భావించినవాడు., ~ కార్తికేయుడు – కృత్తికల తనయుడు, కృత్తికా నక్షత్ర సమయంలో అవతరించాడు, ~ శరవణభవుడు – శరవణము అనే రె...